: నీతో చెప్పేదేమీ లేదు... జగన్ తోనే మాట్లాడతా: చెవిరెడ్డితో జ్యోతుల

వైకాపా నుంచి తన అనుచరులతో కలిసి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశంలోకి చేరుతారన్న ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఈ ఉదయం తన ఇంటికి వచ్చిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కాసేపు ఏకాంతంగా ముచ్చటించిన జ్యోతుల, అధినేత జగన్ తో స్వయంగా మాట్లాడతానని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ మారే విషయమై చెవిరెడ్డితో మాట్లాడాల్సింది ఏమీ లేదని, తన అభిప్రాయం, పార్టీలో తనకెదురైన అవమానాలపై జగన్ కు చెప్పిన తరువాతే ఓ నిర్ణయం తీసుకుంటానని జ్యోతుల వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జ్యోతులతో చర్చలు ముగిసిన అనంతరం చెవిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ మారి తప్పుడు సంకేతాలు పంపవద్దని ఆయన జ్యోతులకు సూచించారని సమాచారం.

More Telugu News