: రెండు నెలల పాపాయే.. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు రారాణి!
అమెరికాలో రెండు నెలల పాపాయి సోషల్ మీడియాలో విపరీతమైన పాప్యులారిటీని సంపాదించుకుంటోంది. ఎలా అంటారా.. అమెరికాలో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తోన్న మెకంజీ కప్లాన్ అనే మహిళకి నిండైన తలకట్టుతో ఈ పాప పుట్టింది. మామూలుగా అప్పుడే పుట్టిన శిశువుకి గుండు కనిపించేటట్లుగా సన్నని జట్టు ఉంటుంది. కానీ ఈ పాప నిండు జట్టుతో జన్మించింది. ఈ పాప ఫోటోను మెకంజీ కప్లాన్ సోషల్ మీడియాలో పెట్టింది.
ఆమె బంధువు ఒకరు ఆ ఫోటోల్ని రకరకాలుగా ఫోటో షాప్ చేశారు. ఆ ఫోటోల్లో పాపాయి న్యూస్ రీడర్‌గా, హ్యారీపోర్టర్గా రకరకాల క్యారెక్టర్లలో డిజైన్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇక ఆ చిత్రాలకు షేర్లపై షేర్లు, లైకులపై లైకులు వచ్చేశాయి. నెటిజన్ల నుంచి వచ్చిన అద్భుత స్పందనతో ఆ తల్లి ఎంతగానో మురిసిపోతోంది. ఇంత చిన్న వయసులో తన జుట్టు వల్ల పాప ఇంత ఫేమస్ అయిపోయినందుకు గర్వంగా ఉందని చెప్తోంది. సోషల్ మీడియానా మజాకా.. రెండేళ్ల పాపను సోషల్ మీడియా ఇంతగా ఫేమస్ చేసేసింది. ఆ పాపకు జీవితాంతం గుర్తిండి పోయే మెమరీలను ఇస్తోంది.