: కేరళకు చెందిన 'ఫాదర్'ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
అరబ్ దేశం యెమెన్‌లో ఓ భారతీయుడు కిడ్నాప్ అయ్యాడు. కేరళకు చెందిన ఫాదర్ టామ్ ఉజున్నలిల్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ధ్రువీకరించారు. ఆయనను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె ట్వీట్ చేశారు. కేరళ ప్రభుత్వం కూడా ఫాదర్ టామ్ ఉజున్నలిల్ కిడ్నాప్ ఉదంతంపై స్పందించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.