: ఎలాంటి దర్యాప్తుకైనా సహకరిస్తాం: రింగింగ్ బెల్స్ ఎండీ
ఎటువంటి దర్యాప్తుకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రింగింగ్ బెల్స్ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థ ఎండీ మోహిత్ గోయల్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వ దర్యాప్తుకు సహకరిస్తున్నామని, భవిష్యత్ లో ఎలాంటి దర్యాప్తుకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాగా, రింగింగ్ బెల్స్ ఎండీ మోహిత్ గోయల్, చైర్మన్ అశోక్ చద్దాలపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.