: కొత్త మార్గాల్లో హెరాయిన్ అక్రమరవాణా!

మాదక ద్రవ్యం అక్రమ రవాణాకు నిందితులు కొత్త మార్గాలు అవలంబిస్తున్నారు. తాజాగా, తమిళనాడులోని సలేమ్ నుంచి అమెరికాకు తరలించేందుకుగాను 27 బ్యాగుల హెరాయిన్ ను వృద్ధుడు మైగ్యుల్ మింగేశాడు. అతను మింగేసిన బ్యాగుల్లో ఒకటి చిరిగిపోవడంతో హెరాయిన్ అతని రక్తంలో కలిసి ఓవర్ డోస్ అయింది. దీంతో మైగ్యుల్ ను సలేమ్ లోని ఒక ఆసుపత్రికి తరలించగా, ఆ బ్యాగులను అతని పొట్టలో నుంచి వైద్యులు తీశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News