: అతి సమీపం నుంచి కాల్చినా అతను బతికిపోయాడు!

'అతనికి ఈ భూమిపై ఇంకా నూకలు చెల్లివున్నాయి..' అనే నానుడి బ్రెజిల్‌లోని ఓ వ్యాపారికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఎందుకంటే, పాయింట్ బ్లాంక్ రేంజిలో రివాల్వర్‌తో కాల్పులు జరిపినా అతను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. సాధారణంగా పాయింట్ బ్లాంక్ రేంజి(అతి సమీపం నుంచి)లో రివాల్వర్‌తో కాల్పులు జరిపితే త‌ప్పించుకోవ‌డం అసాధ్య‌మే. కానీ బ్రెజిల్‌లోని ఓ వ్యాపారికి అది సాధ్య‌మైంది. దుంగుడు బ్రెజిల్‌లో ఓ షాపు యజమానిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో రివాల్వర్‌తో కాల్పులు జరిపినా, సదరు షాపు యజమాని మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వ్యవహారం మొత్తం మీడియాకు ఎక్కింది. బ్రెజిల్‌లోని అరగువాపజ్ నగరంలో ఇదంతా జరిగింది. జైరే నాటో గొంజాలో డిసౌజా (35) అనే వ్యాపారి వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ దుండ‌గుడు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జ‌రిపాడు. దీంతో ఆయ‌న‌ ఓ కార్డుబోర్డు అట్ట పట్టుకున్నాడు. దుండగుడు ఎన్నో బుల్లెట్లు కాల్చినా అవి మిస్సయ్యాయి. కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే టార్గెట్‌కు తగిలాయి. వాటిలో ఒకటి తల పక్క నుంచి రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో బుల్లెట్ మాత్రం అతడు అడ్డుపెట్టుకున్న కార్డుబోర్డు నుంచి దూసుకెళ్లి పొట్టలో దిగింది. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ తీసేశారు. దాంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఫుటేజి చూసిన పోలీసులు నిందితుడిని గుర్తించి గాలిస్తున్నారు.

More Telugu News