: విషమైనా తీసుకుంటా!... టీడీపీలో మాత్రం చేరను: వైసీపీ నేత సంచలన వ్యాఖ్య

కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత పేర్ని వెంకటరామయ్య (నాని) నిన్న సంచలన వ్యాఖ్య చేశారు. తాను టీడీపీలో చేరుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన నిన్న మచిలీపట్నంలో మీడియా సమావేశం పెట్టి సదరు ప్రచారాన్ని తిప్పికొట్టారు. విషమైనా తీసుకుంటా కాని టీడీపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విప్ పదవికి రాజీనామా చేసిన నాని... నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి వైసీపీలో చేరిపోయారు. వైఎస్ పై ఉన్న అభిమానంతోనే నాడు తాను కేబినెట్ ర్యాంకు పదవిని తృణప్రాయంగా త్యజించానని నాని పేర్కొన్నారు. అలాంటి తాను తాజాగా టీడీపీలో చేరతానని ఓ పత్రిక తప్పుడు కథనాలను రాస్తోందని ఆయన మండిపడ్డారు.

More Telugu News