: టీమిండియాకు అతనే సరికొత్త సచిన్... కోహ్లీపై సీనియర్ల ప్రశంసలు!


టీమిండియాకు సరికొత్త సచిన్ టెండూల్కర్...విరాట్ కోహ్లీ అని మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానెల్ తో వారు మాట్లాడుతూ, విరాట్ ను టీమిండియా ఆటగాళ్లు సచిన్ ను చూసినట్టు చూస్తున్నారని అన్నారు. టీమిండియాలో విరాట్ శకం మొదలైందని వారు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా కోహ్లీ ఆటతీరు గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. దీనిని అతని గణాంకాలే రుజువు చేస్తున్నాయని వారు చెప్పారు. పాక్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్... ఆటలో అతని పరిణతిని చెబుతోందని వారు పేర్కొన్నారు. త్వరలోనే కోహ్లీ టెస్టుల్లోనే కాకుండా పరిమితి ఓవర్ల కెప్టెన్ గా కూడా పగ్గాలు అందుకుంటాడని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News