: ట్రంప్ ను చూస్తుంటే భయమేస్తోంది: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్య
అమెరికాలో రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ దూకుడును చూస్తుంటే భయం వేస్తోందని, ఆయనకు యూఎస్ లో పెరుగుతున్న పాప్యులారిటీ ప్రపంచానికి దురదృష్టకరమని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆయన తీరు, వ్యాఖ్యలతో భయం వేస్తోంది. ట్రంప్ కు లభిస్తున్న మద్దతు అనర్థాలు తేవచ్చు" అని లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నారు.
"ట్రంప్ వైఖరి తలచుకుంటే వణుకు వస్తోంది. అమెరికా భవిష్యత్తు గురించి ఊహించినా అదే అనిపిస్తోంది" అని 2007 నుంచి 2012 వరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న సర్కోజీ వివరించారు. ట్రంప్ ప్రచారం ఏహ్యభావాన్ని కలిగిస్తోందని, ముస్లింల గురించి ఆయన మాట్లాడే మాటలు వివాదాస్పదమని, ఆయన అధ్యక్షుడైతే అమెరికా, ఫ్రాన్స్ మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదాలు అధికమని అన్నారు.