: చెప్పు విసిరింది బీజేపీ అనుబంధ సంస్థ కార్యకర్త!
కన్నయ్య కుమార్ పై చెప్పులు విసిరిన వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి. కన్నయ్యను వ్యతిరేకిస్తున్న బీజేపీ అనుబంధ సంస్థ గోరక్షాదళ్ కార్యకర్తలు పలువురు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ముందుగానే ప్లాన్ ప్రకారం చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. వారిలో ఇద్దరు కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఒక వ్యక్తి చెప్పు విసిరాడని తెలిపారు. చెప్పు విసిరిన గోరక్షాదళ్ కార్యకర్త పవన్ కుమార్ రెడ్డి, అతనితో కలసి నినాదాలు చేసిన నరేష్ కుమార్ లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిని విచారించిన అనంతరం కేసు నమోదు చేయనున్నామని పోలీసులు వెల్లడించారు.