: చివరి బంతిని ఎలా వేయాలి?: పాండ్యా ప్రశ్నకు అశ్విన్ ఇచ్చిన సలహా!


ఆరు బంతులు... 11 పరుగులు చేస్తే చిరస్మరణీయ విజయం. బంతి పాండ్యా చేతుల్లో... ఆడుతోంది క్రీజులో కుదురుకుపోయిన బంగ్లా ఆటగాళ్లు ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా. తొలి బంతికి సింగిల్, ఆపై రెండు బంతుల్లో రెండు ఫోర్లు. భారత అభిమానులు విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ, అదృష్టలక్ష్మి భారత్ వైపు నిలిచింది. రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. ఆపై మిగిలింది ఒక్క బంతి. దీన్ని ఎలా వేయాలి? ఈ సందేహం పాండ్యాకు వచ్చింది. టీమిండియా మైదానంలో గుమికూడింది. చివరి బంతికి సింగిల్ తీస్తే, మ్యాచ్ డ్రా అవుతుంది. సింగిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకపోతే, భారత్ గెలవవచ్చు. ఈ బాల్ ఎలా వేయాలన్న పాండ్యా ప్రశ్నకు స్పిన్నర్ అశ్విన్ సమాధానం ఇచ్చాడు. "ఓ బౌన్సర్ వేయాలన్నది నా ఆలోచన. ఎందుకంటే బౌన్సర్ ను కొట్టాలంటే చాలా కష్టం. అందులో కూడా లోయర్ ఆర్డర్లో వచ్చే వారు బౌన్సర్లు కొట్టలేరు" అని సలహా ఇచ్చాడు. దాన్నే పాటించిన పాండ్యా బంతిని బ్యాట్స్ మెన్ కు దొరక్కుండా పైనుంచి వెళ్లేలా లోవర్ బౌన్స్ వేశాడు. దీంతో విజయం భారత వశమైంది. ఆఖరి బంతికి ముందు జరిగిన విషయాన్ని మీడియా సమావేశంలో అశ్విన్ స్వయంగా వెల్లడించాడు.

  • Loading...

More Telugu News