: ‘బంగ్లా’ లక్ష్యం 147 పరుగులు
బెంగళూరు వేదికగా టీ20 ప్రపంచకప్ లో బంగ్లాతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 146 పరుగులు చేసింది. భారత్ స్కోరు బోర్డు: రోహిత్ శర్మ (18), శిఖర్ ధావన్ (23), విరాట్ కోహ్లి (24), సురేశ్ రైనా (30), హెచ్.హెచ్. పాండ్యా (15), యువరాజ్ సింగ్ (3), జడేజా 12 పరుగులు చేయగా టీమిండియా కెప్టెన్ ధోని, అశ్వినిలు నాటౌవుట్ గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లు ఎవరెన్ని వికెట్లు పడగొట్టారంటే... షువగత, షకిబ్ అల్ హసన్, మహమ్మదుల్లా ఒక్కొక్క వికెటు తీసుకోగా, అల్-అమీన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహమాన్ లు రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.