: ఐస్ బకెట్, రైస్ బకెట్ పోయాయి... లేటెస్ట్ గా లేడీస్ స్పెషల్ 'ఏ4 సైజ్ చాలెంజ్'!


సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఒక చాలెంజ్ వచ్చి, అది నచ్చితే ఎంత వైరల్ అవుతాయో ఆమధ్య ఐస్ బకెట్, రైస్ బకెట్ వంటి చాలెంజేస్ నిరూపించాయి. ఇప్పుడు తాజాగా ఫిట్ నెస్, అందునా అతివలు తమ శరీరాకృతి పట్ల ఎంత అవగాహనతో ఉన్నారన్న విషయాన్ని తెరపైకి తెస్తూ, 'ఏ4 సైజ్ చాలెంజ్' ఒకటి శరవేగంగా చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా ఏ4 సైజ్ పేపర్ ను తమ నడుం దగ్గర ఉంచి ఎంత ఫిట్ గా ఉన్నామో చూసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వీటికి వస్తున్న లైక్ లు, కామెంట్లతో ఆనందపడిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ ట్రెండ్ అన్ని దేశాలకూ పాకిపోయింది. అయితే, నడుమును సన్నగా చూపించుకోవాలనుకొని ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారని విమర్శిస్తున్న వారూ ఉన్నారులెండి!

  • Loading...

More Telugu News