: టీ-20 వరల్డ్‌కప్: భారీ విజయమే లక్ష్యంగా బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్
టీ-20వరల్డ్‌కప్ గ్రూప్-2 పాయింట్ల పట్టికలో దిగువన నాలుగో స్థానంలో ఉన్న ధోనీసేన భారీ విజయం కోసం ఆరాటపడుతోంది. ఈ రోజు భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించాల్సిన అవసరం ఏర్పడింది. దోనీసేన పాకిస్థాన్‌పై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. న్యూజిలాండ్ చేతిలో ఓడినా భారత బౌలింగ్ మెరుగ్గానే సాగింది. దీంతో కోట్లాది మంది భారత్ క్రికెట్ ప్రేమికులు భారత్ బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.