: డప్పు కొట్టి, స్టెప్పులేసిన చంద్రబాబు... హోలీ వేడుకల్లో టీడీపీ అధినేత సందడి

రంగుల కేళీ హోలీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సందడి చేశారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన వేడుకల్లో భాగంగా చంద్రబాబు తలపాగా చుట్టి సరికొత్త లుక్కుతో కనిపించారు. ఈ తర్వాత డప్పు చేతబట్టి దరువేసిన చంద్రబాబు... అక్కడికి వచ్చిన లంబాడీ మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరి జీవితాలు కొత్త వెలుగులతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో చంద్రబాబుతో కలిసి టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మరో కలర్ లో తలపాగా చుట్టారు. ఈ వేడుకల్లో పార్టీ రెండు రాష్ట్రాల శాఖలకు చెందిన నేతలు టీడీ జనార్దన్, రమేశ్ రాథోడ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

More Telugu News