: నిదానంగా ఆడుతున్న బంగ్లా ఆటగాళ్లు...64/3
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా జట్టు నిదానంగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ సౌమ్య సర్కార్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన షబ్బీర్ రెహమాన్ (12) కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. దీంతో కష్టాల్లో పడ్డ బంగ్లా జట్టును ఓపెనర్ మహ్మద్ మిథున్ (23) సీనియర్ షకిబ్ అల్ హసన్ (18) తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద షేన్ వాట్సన్ కు దొరికిపోయాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు పది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో వాట్సన్ రెండు వికెట్లు తీయగా, జంపా ఒక వికెట్ తీశాడు.