: ఫుట్ బాల్ ఆటగాడికి భారీ జరిమానా
బ్రెజిల్ కు చెందిన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు నెయ్ మార్ కు ఫెడరల్ న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. నైకీ షూకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎండార్స్ మెంట్లు చేసిన నెయ్ మార్ దాని ద్వారా వచ్చిన ఆదాయానికి కాకిలెక్కలు చూపాడంటూ పత్రికా కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన ఆదాయపుపన్ను శాఖ ఫెడరల్ కోర్టులో విచారణ చేపట్టింది. నెయ్ మార్ పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని నిర్ధారించిన న్యాయస్థానం 53 మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పుచెప్పింది. నెయ్ మార్ ఆస్తులను స్తంభింపజేసిన కొద్దికాలానికే తీర్పు వెలువడడం విశేషం. కాగా, న్యాయస్థానం తీర్పుపై నెయ్ మార్, లేదా అతని ప్రతినిథులు స్పందించాల్సి ఉంది.