: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. పెట్రోల్ పై లీటర్ కు 3.07 రూపాయలు, డీజిల్ పై 1.90 రూపాయల మేర పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కాసేపటి క్రితం ప్రకటించాయి. ఈ ధరలకు రాష్ట్రాల పన్నులు కలుపుకుంటే మరికొంత మేర పెరగనున్నాయి. పెంపుదల తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ 59.68 రూపాయలు, కోల్ కతాలో 63.76 రూపాయలు, ముంబైలో 65.79 రూపాయలు, చెన్నైలో 59.13 రూపాయలుగా ఉండనున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు రంగ కంపెనీలు చివరి సారిగా గత నెల 29న సవరించాయి. అప్పుడు పెట్రోల్ ధరను తగ్గించగా, డీజిల్ ధరను పెంచాయి. తాజాగా మరోసారి డీజిల్ దర పెరగడంతో ఆ మేరకు వినియోగదారులపై భారం పడనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ప్రతి నెల 1న, 16వ తేదీన అప్పటి డాలర్ తో రూపాయి మారకపు విలువ, అంతర్జాతీయంగా చమురు ధరలకు అనుగుణంగా ధరలను సవరిస్తుంటాయి.

More Telugu News