: ఒవైసీ నాలుక తెగ్గోస్తే రివార్డు ఇస్తా: మీరట్ కాలేజీ విద్యార్థి

తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనే నినాదం చేయనంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కళాశాలకు చెందిన విద్యార్థినేత మండిపడ్డాడు. ఒవైసీ నాలుక తెగ్గోసిన వారికి రూ.21 వేలు బహుమతిగా ఇస్తానంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు దుష్యంత్ తోమర్ ప్రకటించాడు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒవైసీ దేశభక్తుడు కాదని నిరూపించుకున్నారని, అటువంటి వ్యక్తి లోక్ సభ సభ్యత్వానికి అర్హుడు కాదని అన్నారు. ఒవైసీ లోక్ సభ సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు.

More Telugu News