: రోజా కేసు విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసు తదుపరి విచారణ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. హైకోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణలో రోజా తరపు వాదనలు పూర్తయ్యాయి. కాగా, సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు పరిశీలించింది. ఈ కేసును మరో బెంచ్ కు అప్పగించింది. అత్యవసర వ్యాజ్యంగా స్వీకరించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేసు విచారణ చేపట్టారు.

More Telugu News