: చెక్ బౌన్స్ కేసులో సినీ హీరో ప్రభాస్ సోదరుడికి జైలు శిక్ష
చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు ప్రభాస్ సోదరుడు ఉప్పలపాటి ప్రభోద్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు హైదరాబాద్ రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రానికి ప్రభోద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యాపారి వద్ద రూ.43 లక్షలు అప్పుగా ప్రభోద్ తీసుకున్నారు. ఈ అప్పు తీర్చే క్రమంలో రూ.43 లక్షలకు సంబంధించిన ఒక చెక్ ను సదరు వ్యాపారికి ప్రభోద్ ఇచ్చాడు. అయితే, ఈ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని పలుసార్లు ప్రభోద్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో సదరు వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిన్న కోర్టులో విచారణ జరిగిన అనంతరం ప్రభోద్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.