: బీజేపీ ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ గుర్రం కాలు తొలగింపు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడిలో తీవ్రంగా గాయపడ్డ పోలీస్ గుర్రం కాలుని వైద్యులు తొలగించారు. డెహ్రాడూన్ లో బీజేపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అడ్డుకున్నారనే అక్కసుతో పోలీసు బందోబస్తు నిమిత్తం అక్కడ ఉన్న పోలీస్ గుర్రం 'శక్తిమాన్'పై గణేష్ జోషి విచక్షణారహితంగా లాఠీతో బాదాడు. ఈ సంఘటనపై 'పెటా'తో పాటు నెటిజన్ల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి.