: పిలిచిన వాటికి రారు, పైగా ఆరోపణలు చేస్తారు: వైఎస్సార్సీపీ సభ్యుడిపై ప్రత్తిపాటి ధ్వజం

నరసరావుపేట నియోజకవర్గంలో స్పీకర్ సమీక్ష నిర్వహించేటప్పుడు తనను ఆహ్వానించడం లేదని, తనకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో కార్యక్రమాలకు ఆహ్వానిస్తే హాజరుకాకపోగా, ఆరోపణలు చేస్తున్నారా? అని మండిపడ్డారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ కోడెల పాటుపడుతున్నారని, రాజకీయాలకు అతీతంగా ఆయన పాటుపడుతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. కాగా, తన హక్కులు కాపాడాల్సిన స్పీకరే ఈవిధంగా వ్యవహరిస్తుండటం దారుణమని, తన హక్కులు కాలరాయడం సరికాదని శ్రీనివాసరెడ్డి అన్నారు.

More Telugu News