: మయన్మార్ అధ్యక్షుడిగా గెలిచిన సూకీ మాజీ డ్రైవర్
మయన్మార్ లో సైనిక నియంత్రణను తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా, తనకు నమ్మకస్తుడు, మాజీ డ్రైవర్ యు హితిన్ క్యాను అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దింపిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ ఫలితం సాధించారు. నేడు ఉదయం మయన్మార్ పార్లమెంటు ఉభయసభల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 652 ఓట్లు పోలవగా, అధ్యక్ష స్థానం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజారిటీని హితిన్ క్యా సాధించారు. ఆయనకు మొత్తం 360 ఓట్లు లభించాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం విదేశీ బంధమున్న వారు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు లేకపోవడంతో, ఆమె హితిన్ ను బరిలోకి దించారు.