: ఏపీకి హోదాపై కదిలిన కాంగ్రెస్... లోక్ సభలో జ్యోతిరాదిత్య, రాజ్యసభలో గులాంనబీ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నోటీసులు ఇచ్చింది. ఈ ఉదయం లోక్ సభలో ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లు నోటీసులు ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు, నెరవేరుస్తామని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కదలాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి తదితరులు కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చించారు.

More Telugu News