: పారిపోయే ముందు జైట్లీతో చర్చలు జరిపిన మాల్యా: సమాధానం చెప్పాలంటున్న కాంగ్రెస్
మార్చి 2న దేశం విడిచి పారిపోయే ముందు రోజున యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యుడి హోదాలో పార్లమెంటుకు హాజరై, అరుణ్ జైట్లీని కలిశాడని వచ్చిన వార్తలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జైట్లీ, మాల్యా ఎందుకు భేటీ అయ్యారో వివరణ ఇవ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా అన్నారు. ఈ సమావేశం గురించిన వివరాలు ప్రధాని మోదీకి తెలిసుంటే, ఆయన స్పందించాలని కోరారు. మాల్యాను తిరిగి దేశంలోకి తీసుకురాలేకుంటే, ఈ కేసు కూడా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ కేసులా మారిపోతుందని సుర్జేవాలా హెచ్చరించారు.