: జగన్ మాట్లాడుతుంటే ... సాంకేతిక సమస్యతో నిలిచిన ప్రత్యక్ష ప్రసారం
వైఎస్ జగన్ మాట్లాడుతున్న వేళ, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. అంతకుముందు జగన్ మాట్లాడుతుండగా పలుమార్లు మంత్రులు అడ్డుకున్నారు. మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులు పదేపదే అడ్డుకున్నారు. మంత్రులు కల్పించుకోవడంపై మండిపడ్డ జగన్, అధికారపక్షం వారు మాట్లాడుతుంటే తాము అన్నీ ఓపికగా విన్నామని, తాము మాట్లాడుతుంటే, ఇలా కల్పించుకోవడం భావ్యం కాదని హితవు పలికారు. ఆ సమయంలో స్పీకర్ కల్పించుకుని, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు, క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం మంత్రులకు ఉంటుందని వివరించారు. కాగా, సాంకేతిక కారణాల కారణంగా లైవ్ నిలిచినట్టు తెలుస్తోంది.