: బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు


వచ్చే రెండు వారాల వ్యవధిలో డబ్బు అవసరాలు బాగా ఉంటే కనుక పది రోజుల్లోపు చక్కబెట్టుకోండి. ఎందుకంటే, పై వచ్చే గురువారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవు కాబట్టి. 24- గురువారం నాడు హోలీ, 25- శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే, ఆపై నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రానున్నాయి. ఇండియాలోని అత్యధిక రాష్ట్రాల్లో ఈ నాలుగు రోజుల పాటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ బ్యాంకుల ఏటీఎంలలో 23- బుధవారం సాయంత్రం తరువాత తిరిగి సోమవారం నాడు మాత్రమే నగదు నింపే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన ప్రాంతాల్లోని ఏటీఎంలలో రెండు రోజుల్లోనే నగదు అయిపోతుంటుంది. ఇక వరుస సెలవులు వస్తే, మరింత త్వరగా నిండుకుంటుంది. సొంత బ్యాంకు ఏటీఎంలలో నగదు నిండుకుంటే, రూ. 20 పెట్టి ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను (ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఏంలలో కాకుండా ఇతర బ్యాంకు ఏటీఏంలలో రెండు లావాదేవీలు పూర్తయిపోయిన పక్షంలో) ఆశ్రయించవచ్చు. కాగా, ఇలా వరుస సెలవులు రావడంతో బ్యాంకు ఉద్యోగులు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News