: ముగిసిన కౌన్సెలింగ్... రాజీకొచ్చిన మధుప్రియ,శ్రీకాంత్ దంపతులు
సింగర్ మధుప్రియ-శ్రీకాంత్ దంపతులు రాజీకి వచ్చారు. హుమాయూన్ పోలీసుల సమక్షంలో మానసిక వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిద్దరితో విడివిడిగాను... ఇద్దరినీ కలిపి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మధుప్రియ విలేకరులతో మాట్లాడుతూ, మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయిందని, కొన్నాళ్లు కలిసి ఉండాలని పోలీసులు చెప్పారని పేర్కొంది. అప్పుడు అతని తీరు మారకుంటే రెండోదశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పోలీసులు అన్నారని చెప్పింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో పాటే తాను ఉండాలని అనుకుంటున్నట్లు మధుప్రియ పేర్కొంది. కౌన్సెలింగ్ నిర్వహించిన తరువాత శ్రీకాంత్ మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటన్న మీడియా ప్రశ్నకు అతను మంచివాడు అని చెప్పి వెళ్లిపోయింది. కాగా, తన భర్త వేధిస్తున్నాడంటూ మధుప్రియ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.