: పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి చైనా సైన్యం!

తరచుగా లడఖ్‌ ప్రాంతం నుంచి చొచ్చుకు వచ్చే చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పిఎల్‌ఎ).. తాజాగా పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నియంత్రణరేఖ (ఎల్‌ఓసి)ప్రాంతంలోకి ప్ర‌వేశించింది. చైనా ఆర్మీ ద‌ళాలు సంచరిస్తుండ‌డంతో ఆ ప్రాంత‌ సైనిక దళాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఉత్తర కాశ్మీర్‌లోని నౌగమ్‌ సెక్టార్‌ వద్ద పిఎల్‌ఎ సీనియర్‌ అధికారులను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. అయితే, ఎల్‌ఓసి వెంట కొన్ని మౌలిక నిర్మాణాలు చేపట్టడానికి చైనా ఆర్మీ అధికారులు అక్కడకు వచ్చినట్లు పాక్‌ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై భారత సైనికాధికారులు మౌనం పాటిస్తున్నా, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, త‌మ‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనా ప్ర‌భుత్వం చైనా గెజ్‌హౌబా గ్రూప్ కంపెనీ లిమిటెడ్ ద్వారా హెల్బ‌మ్-నీల‌మ్ 970 ఎండ‌బ్యూ హైప‌ర్ ప‌వ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News