: ఢిల్లీ వీధుల్లో అమితాబ్ నడుస్తుంటే... గుర్తించని ప్రజలు!
లెజండరీ హీరో అమితాబ్ బచ్చన్ ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే ఎవరూ గుర్తు పట్టలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన అధికారిక బ్లాగ్ లో వివరించి ఫోటోలు పెట్టారు. షూజిత్ సర్కారు తదుపరి సినిమా కోసం తాను వీధుల్లో నడవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తనను ఎవరూ గుర్తు పట్టనంత సహజంగా మేకప్ వేసిన ఆర్టిస్టుదే ఈ క్రెడిట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖాకీ ట్రౌజర్, బ్లాక్ జాకెట్, కాలుష్యం బారిన పడకుండా ముఖానికి మాస్క్ ధరించిన ఫోటోను అమితాబ్ బ్లాగ్ లో ఉంచారు. ఆ ఫోటోను మీరూ చూడవచ్చు.