: అమెరికాలో ఎక్కువ వేతనాలు అందుకునేది డాక్టర్లే !
అమెరికాలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ జీతాలు అందుకుంటున్నది అక్కడి వైద్యులేనట! ఆ తర్వాత లాయర్లు, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగంలో పనిచేసే వారు ఎక్కువ జీతాలు అందుకుంటున్నవారి వరుసలో ఉన్నారు. ఈ విషయాన్ని 'గ్లాస్ డోర్' వెబ్ సైట్ పేర్కొంది. సదరు వెబ్ సైట్ అంచనాల ప్రకారం సాఫ్ట్ వేర్ రంగం ఉద్యోగులు వేతనాల చెల్లింపుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయా ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారి నైపుణ్యం మేరకు వారి జీతాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. సగటు లెక్కలను మాత్రమే తీసుకుని పలు రంగాలకు చెందిన ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలను సదరు వెబ్ సైట్ లెక్కగట్టింది. మొదటి 10 స్థానాల్లో ఉన్న ఉద్యోగాలు.. వేతనాల వివరాలు...
* ఫిజీషియన్ కు ఏడాదికి సగటున - 1,80,000 డాలర్లు
* న్యాయవాదికి - 1,44,500 డాలర్లు
* రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ మేనేజర్ కు- 1,42,120 డాలర్లు
* సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ మేనేజర్ కు - 1,32, 000 డాలర్లు
* ఫార్మసీ మేనేజర్ కు - 1,30, 000 డాలర్లు
* స్ట్రాటజీ మేనేజర్ కు- 1,30, 000 డాలర్లు
* సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ కు- 1,28, 250 డాలర్లు
* ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైనర్ ఇంజనీర్ కు- 1,27, 500 డాలర్లు
* ఐటీ మేనేజర్ కు- 1,23, 152 డాలర్లు
* సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కు- 1,20,000 డాలర్లుగా గ్లాస్ డోర్ వెబ్ సైట్ పేర్కొంది. కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అప్లికేషన్ డెవలప్ మెంట్ మేనేజర్, సిస్టమ్స్ ఆర్కిటెక్ట్, ఫైనాన్స్ మేనేజర్, డేటా సైంటిస్టు, రిస్క్ మేనేజర్, క్రియేటివ్ డైరెక్టర్, డేటా ఆర్కిటెక్ట్, టాక్స్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్ ఉన్నారు.