: ఆర్థిక ఇబ్బందులతో మహిళా హోంగార్డు ఆత్మహత్య

కుటుంబ పోషణ భారమవడంతో పురుగుల మందు తాగి మహిళా హోంగార్డు సరిత ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ పట్టణంలో ఈరోజు ఈ సంఘటన జరిగింది. వరంగల్ జిల్లా కార్యాలయంలో సరిత విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త మరణించడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆమెపై పడింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనోవేదన చెందిన సరిత ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News