: ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన దానితో పోలిస్తే... మేం చేసింది ఎంత?: ఎర్రబెల్లి కామెంట్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసింది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పిన ఎర్రబెల్లి... పార్టీ శాసనసభాపక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేశామని తెలిపారు. అయినా గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావును గద్దె దించి చంద్రబాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే... మేం చేసింది ఎంత? అని ఆయన మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ లోకి వస్తానంటూ తాను ఏ ఒక్క నేతకు కూడా ఫోన్ చేయలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

More Telugu News