: సత్యదేవుని సాక్షిగా అశ్లీల నృత్యాలు... చోద్యం చూసిన అన్నవరం ఆలయ అధికారులు

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో అపచారం చోటుచేసుకుంది. సత్యదేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుందామని వచ్చిన ఓ కొత్త జంట వెంట వచ్చిన బంధువులు... పెళ్లి తంతులో భాగంగా ఆలయ ఆవరణలోనే రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. మహిళా డ్యాన్సర్లతో కలిసి పురుషులు ఆలయ పరిసరాల్లోనే అశ్లీల నృత్యాల్లో మునిగిపోయారు. ఈ తంతు మొత్తం తమ కళ్ల ముందే జరుగుతున్నా, ఆలయ అధికారులు నోరు మెదపలేదు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుడి ఆలయంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులిచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ ప్రతినిధులు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయగా, సదరు ఛానెల్ దీనిని నేటి ఉదయం ప్రసారం చేసింది.

More Telugu News