: కాలం మారినా నా అలవాటు మాత్రం మారలేదు: అమితాబ్ బచ్చన్
కాలం మారినా తన అలవాటు మాత్రం మారలేదని బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. అసలు ఈ విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించారంటే... ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు రెండు కాళ్లూ పైన పెట్టుకుంటారు. ఈ అలవాటు తనకు మొదటి నుంచి ఉందని అమితాబ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో పాటు రెండు ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఆ రెండు ఫొటోల్లో ఒకటి 1975 లో షోలే చిత్రం సెట్ లో ఫొటో కాగా, రెండో ఫొటో 2015లో ఒక ప్రకటన కోసం పనిచేస్తున్నప్పుడు దిగింది. ఈ రెండు ఫొటోల్లో ఆయన కుర్చీలో కూర్చుని ఉండటమే కాదు.. కాళ్లు రెండూ పైన పెట్టుకుని ఉండటం ఈ ఫొటోల ప్రత్యేకత.