: విమాన ప్రయాణికులకు పెద్ద రిలీఫ్... గాడ్జెట్లకు విడిగా చెకింగ్ తొలగింపు!

తరచూ విమానాల్లో ప్రయాణించే వారికి ఇదో గుడ్ న్యూస్. ఇకపై హ్యాండ్ బ్యాగేజీలోని ఐపాడ్, ట్యాబ్లెట్లను విడిగా బయటకు తీసి ట్రేల్లో పెట్టి సెక్యూరిటీ ఎక్స్-రే స్కాన్ ను చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిబంధనలను సరళీకృతం చేసింది. సెక్యూరిటీ చెక్ లో భాగంగా గాడ్జెట్లను విడిగా పరిశీలించాల్సిన అవసరం లేదని, అధునాతన సాంకేతికతో హ్యాండ్ బ్యాగేజీలో ఉన్నా చెకింగ్ పూర్తవుతుందని తెలిపింది. ఈ నిర్ణయాన్ని విమానాశ్రయాల భద్రతను పర్యవేక్షిస్తున్న సీఐఎస్ఎఫ్, పారామిలటరీ దళాలకు వెల్లడించామని ఓ అధికారి వివరించారు. కాగా, బ్యాటరీలను వేరు చేయడానికి వీలున్న గాడ్జెట్ లను నిశితంగా పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News