: మాల్యా ఆర్థిక ఉగ్రవాది!... కేంద్రం కళ్ల ముందే పరారీ: శివసేన సంచలన వ్యాఖ్యలు

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల అప్పులను ఎగవేసి లండన్ పారిపోయారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై మహారాష్ట్ర పార్టీ శివసేన ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాక లిక్కర్ కింగ్ వ్యవహారాలను ఆసరా చేసుకుని తన మిత్రపక్షం బీజేపీ సర్కారుపై సెటైర్లు సంధించింది. ఈ మేరకు తన సొంత పత్రిక ‘సామ్నా’ తాజా సంచిక ఎడిటోరియల్ లో శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ మాల్యాను ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించిన ఆ పార్టీ, కళ్ల ముందే ఆర్థిక ఉగ్రవాది తప్పించుకుంటుంటే చేతులు ముడుచుకుని కూర్చున్న బీజేపీ సర్కారు... ఇక స్విస్ బ్యాంకుల్లో దాగున్న నల్లధనాన్ని ఎలా తెస్తుందని ప్రశ్నించింది. మాల్యా దేశం వదిలి పారిపోయాడని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నిస్సిగ్గుగా ప్రకటించుకుందని కూడా శివసేన ఘాటు వ్యాఖ్యలు చేసింది. రూ.9 వేల కోట్లను ఎత్తుకెళుతున్న బడా పారిశ్రామికవేత్త కేంద్రానికి తెలియకుండానే పారిపోతాడా? అని కూడా ఆ పార్టీ ప్రశ్నించింది.

More Telugu News