: జ‌ర్మనీ చేతికి ఇస్లామిక్ స్టేట్‌ సభ్యుల వ్యక్తిగ‌త వివ‌రాల ఫైల్స్

ఇస్లామిక్ స్టేట్ సభ్యుల వ్యక్తిగత వివరాలున్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు జర్మనీ ఫెడరల్ క్రిమిన‌ల్‌ పోలీసులు తెలిపారు. అవి అధికారికమైనవేనని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ట‌ర్కీ, సిరియా స‌రిహ‌ద్దుల్లో ఇస్లామిక్ స్టేట్ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 22వేల ఫైళ్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు బ్రిటన్ కు చెందిన స్కై న్యూస్ పేర్కొంది. ఈ ఫైళ్లలో ఐఎస్ సభ్యుల పేర్లు, వివరాలు, ఫోన్ నంబర్లు ఉన్నాయని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ కు నిధులు అందిస్తున్న వారు, యువ‌కుల‌ను అటువైపు ప్రేరేపిస్తున్న వారి పేర్లు సైతం ఉన్నాయని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ఫైళ్ల‌ను విశ‌దీక‌రించే ప‌నిలో ఉన్నామ‌ని అక్క‌డి ఓ అధికారి పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్‌తో క‌లిసి ఎవ‌రు ప‌నిచేస్తున్నారో తెలుసుకోవ‌డానికి ల‌భించిన ఆధారాలు ఉప‌యోగ‌ప‌డతాయ‌ని జ‌ర్మ‌నీ మంత్రి థామ‌స్ డి మైజైరీ అన్నారు. యూర‌ప్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్‌ రిక్రూట్ మెంట్ నెట్‌వ‌ర్క్ గురించి తెలుసుకోవ‌డానికి మంచి ఆధారాలు ల‌భించాయ‌ని తెలిపారు.

More Telugu News