: ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ అద్భుతమైన ప్రణాళికలతో దూసుకుపోతోందని అన్నారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సరికొత్త సంస్కరణలతో దూసుకుపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యల పట్ల ప్రభుత్వ స్పందన అత్యద్భుతమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News