: జగన్ కు దమ్ముంటే మంత్రులపై ఆరోపణలు నిరూపించాలి: చంద్రబాబు సవాల్

నవ్యాంధ్ర రాజధాని పరిధిలో తన కేబినేట్ మంత్రులు భూ దందాకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆ ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి నిరూపించాలని, లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. బినామీల పేరుతో ఒక్క ఎకరం కూడా కొనాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. జగన్ కు దమ్ముంటే మంత్రులపై సభలో చేసిన ఆరోపణలను నిరూపించాలని... నిరూపిస్తే కనుక ఆ మంత్రులను డిస్మిస్ చేస్తానని చంద్రబాబు అన్నారు. ఒకవేళ జగన్ చేసిన ఆరోపణలు నిజం కాకుంటే ఏ శిక్షకైనా జగన్ సిద్ధమేనా? అని బాబు సవాల్ విసిరారు. మంత్రులపై ఆరోపణలు రుజువు చేశాకే సభ ముందుకెళ్లాలంటూ బాబు ఉద్వేగంగా అన్నారు.

More Telugu News