: ఇండియాలో నాజూగ్గా ఉండే యువతీ యువకులు ఏ రాష్ట్రాల వారంటే...: లోక్ సభలో కేంద్రం లెక్కలు!

భారతీయుల్లో బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్ - శరీర ద్రవ్యరాశి సూచిక) గణాంకాలపై ఆసక్తికర వివరాలను మోదీ సర్కారు నేడు లోక్ సభ ముందు ఉంచింది. త్రిపుర రాష్ట్రంలోని పురుషులు, మేఘాలయాలోని మహిళలు ఇండియాలోనే నాజూకుగా ఉంటారని, వీరి బీఎంఐ అత్యధిక నియంత్రణలో ఉంటోందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. పంజాబీ మహిళల ఆహారపు అలవాట్ల కారణంగా, వారిలో ఓబేసిటీ అధికంగా ఉందని తెలిపారు. బీహార్, మేఘాలయా రాష్ట్రాలు మినహా, మిగతా అన్ని చోట్లా పురుషులతో పోలిస్తే మహిళలు అధిక బరువు, బీఎంఐని కలిగివున్నారని వివరించారు. 2013తో పోలిస్తే 2015 నాటికి అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఇండియాలో 6.5 కోట్ల నుంచి 6.91 కోట్లకు పెరిగిందని, ఈ సంఖ్య ఏ ఏటికాయేడు పెరగడం ఆందోళనకరమని అన్నారు. అధిక బరువులో పంజాబీయులు ముందున్నారని, ఆపై ఢిల్లీ, కేరళ వాసులు టాప్-2లో నిలిచారని వివరించారు. త్రిపురలో 4.8 శాతం మంది మగవారు, 7.1 శాతం మంది ఆడవారు అధిక బరువుతో ఉండగా, మేఘాలయాలో 5.9 శాతం మంది పురుషులు, 5.3 శాతం మంది స్త్రీలు ఒబేసిటీతో బాధపడుతున్నారని తెలిపారు.

More Telugu News