: చంద్రబాబు బావకు కూడా రుణమాఫీ కాలేదు: వాకౌట్ చేసేముందు జగన్

రాష్ట్రంలో రుణమాఫీ పేరిట రైతులను, డ్వాక్రా మహిళలనూ చంద్రబాబు సర్కారు మోసం చేసిందని విపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతున్న వేళ, వైకాపా సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఆయన తప్పుబట్టారు. ఆపై వాకౌట్ చేస్తున్నామని చెబుతూ, సుదీర్ఘంగా ప్రసంగించబోయారు. రుణమాఫీ బూటకమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దగ్గరి బంధువు, బావ వరసైన కొత్తపల్లి నాగరాజునాయుడికే మాఫీ జరగలేదని, పాత కథనాలు చూపబోగా స్పీకర్ మైకును కట్ చేశారు. వాకౌట్ చేయాలంటే కేవలం ప్రొటెస్ట్ చెప్పి వెళ్లిపోవాలని, చర్చకు అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పారు. అనంతరం ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నామని చెబుతూ జగన్ బృందం వాకౌట్ చేసింది.

More Telugu News