: పదేళ్లలో దేశంలో ముగ్గురికి ఉరి...1,398 మందికి కఠిన శిక్షలు పడ్డాయి: కేంద్ర మంత్రి

2004 నుంచి 2014 వరకు మొత్తం పదేళ్లలో మూడు ఉరిశిక్షలు, 1,398 మందికి కఠిన శిక్షలు పడ్డాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్ సభకు తెలిపారు. గత పదేళ్లలో దేశంలో విధించిన శిక్షలపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో తెలిపిన వివరాలను ఆయన లోక్ సభకు లిఖితపూర్వకంగా వివరించారు. ఈ సందర్భంగా భారత న్యాయ కమిషన్ 262వ నివేదిక సూచనలను ఆయన చదివి వినిపించారు. ఉగ్రవాదం, దేశంపై దండెత్తిన వారికి తప్ప ఇతర ఎలాంటి కేసుల్లో ఉరిశిక్షలు విధించవద్దని కమిషన్ సూచించినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నివేదిక పత్రాలు పంపినట్టు ఆయన తెలిపారు.

More Telugu News