: రాముడంటే ఎన్టీఆర్...ఈమధ్య మగధీర, బాహుబలి చూశాను: సుధామూర్తి
తనకు తెలిసి రాముడంటే ఎన్టీఆర్ అని ప్రముఖ రచయిత్రి, వ్యాపారవేత్త, సామాజిక వేత్త పద్మశ్రీ సుధామూర్తి తెలిపారు. తన చిన్నప్పుడు బళ్లారిలో ఉండేవాళ్లమని, అప్పుడు తెలుగు సినిమాలు చూసేదానినని ఆమె అన్నారు. అప్పట్లో రాముడు అంటే ఎన్టీఆరేనని ఆమె అన్నారు. ఇప్పటికీ రాముడంటే ఆయనే గుర్తుకువస్తారని ఆమె చెప్పారు. పురాణాలలోని రాముడు ఎలా ఉండేవాడో తెలియదు కానీ ఎన్టీఆర్ లా ఉండేవాడని మాత్రం తెలుసని ఆమె పేర్కొన్నారు. తనకు తెలుగు మాట్లాడడం బాగా రాదు కానీ అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని ఆమె చెప్పారు. ఈ మధ్య కాలంలో 'మగధీర', 'బాహుబలి' సినిమాలు చూశానని ఆమె అన్నారు. రెండూ బాగున్నాయని ఆమె తెలిపారు.