: వాళ్లిద్దరూ లేకపోవడం మాకు లోటే: వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ

టీట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు వెస్టిండీస్ జట్టు భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ డారెన్ సమీ తమ విజయావకాశాలపై మాట్లాడాడు. ఎక్కువ టీట్వంటీ ఆడే జట్టుగా విండీస్ ఆటగాళ్లకు టీట్వంటీల్లో ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే కీలక ఆటగాళ్లైన పొలార్డ్, నరైన్ టోర్నీకి దూరం కావడం ఇబ్బంది అని పేర్కొన్నాడు. వారి స్థానంలో బ్రాత్ వైట్, ఆష్లే నర్సీలకు అవకాశం కల్పించామని చెప్పాడు. టోర్నీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని సమీ వెల్లడించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో తమ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉండడంతో దుబాయ్ లో ఆడామని చెప్పిన సమీ, దుబాయ్ పిచ్ లకు, భారత్ పిచ్ లకు దగ్గరి సంబంధం ఉంటుందని, తద్వారా టోర్నీ గెలుచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమీ అభిప్రాయపడ్డాడు.

More Telugu News