: హైదరాబాద్ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి: ఫడ్నవీస్ కు కేసీఆర్ ఆత్మీయ ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంతో నీటి వివాదాలపై గడచిన ఏడాది కాలంగా చర్చిస్తున్నామని, ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వరప్రదాయినిగా మారుతుందని భావిస్తున్న మేడిగడ్డ సహా ఐదు ప్రాజెక్టులపై డీల్స్ కుదిరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులతో మహా ప్రజలకూ మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, మహారాష్ట్ర సీఎం, నీటిపారుదల శాఖా మంత్రి హైదరాబాద్ కు వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. దీనికి ఫడ్నవీస్ సైతం సానుకూలంగా స్పందించారు. నాలుగు దశాబ్దాల నుంచి నలుగుతున్న సమస్యకు ఒక్క రోజులో పరిష్కారం లభించిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News