: ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు?: ప్రశ్నిస్తున్న రేణూ దేశాయ్

మహా శివరాత్రి శుభవేళ, మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? అసలు ఉపవాసం ఎందుకు ఉండాలో ఎంతమందికి తెలుసు? దీని వెనకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏంటి?... ఇలా సాగాయి పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ తన ట్విట్టర్ వేదికగా సంధించిన ప్రశ్నలు. రేపు ఉదయం వరకూ మంచి నీరు తప్ప ఎలాంటి ఘన పదార్థాలూ తీసుకోకుండా ఉండాలని, అప్పుడు మాత్రమే ఉపవాస దీక్ష పూర్తయినట్టని సలహా ఇచ్చారు. తన మొబైల్ ఫోన్ సైతం ఆకలిగా ఉందని, తన ట్వీట్లలోని పదాలను తినేస్తోందని ఓ జోకేశారు. ఆపై జాగారం ఎందుకు చేయాలో తెలుపుతూ యూట్యూబ్ లో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, అంతకుముందు ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం.

More Telugu News