: రాజధానిపై రాజకీయం వద్దు: చంద్రబాబు హితవు

రాజధాని అమరావతి నగరంపై ఏ పార్టీ నేతలు రాజకీయాలు చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకున్నారు. తాను ఎంతో బాధ్యతతో ఓ కర్తవ్య దీక్షను చేబూనానని, అవాంతరాలను దాటుతూ ముందడుగు వేస్తుంటే, శంకుస్థాపనకు కూడా రాని ఓ వర్గం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం రాజధాని నిర్మాణం దిశగా సాగుతున్నామని అన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ తాను ఆజన్మాంతం రుణపడి వుంటానని, వారెవరికీ అన్యాయం జరగబోదని అన్నారు. ఏదైనా మంచి పని తలపెడితే, శత్రువులు సైతం వచ్చి ఆశీర్వదించి వెళతారని, ఏపీలో మాత్రం ప్రతిపక్షాలకు ఆమాత్రం సంస్కారం లేకపోయిందని దుయ్యబట్టారు. రాజధానిని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్లిన ఘనత వాళ్లదని వైకాపా పేరు చెప్పకుండా విమర్శించారు. భూములను తీసుకున్న రైతులను మూడు విధాలుగా విభజించామని, సొంత భూములు, అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి విడివిడిగానే పారితోషికాలు అందుతాయని స్పష్టం చేశారు. తాను ఓ విజన్ తో స్పష్టంగా ముందుకు సాగుతున్నానని, ఈ తరహా వివాదాలు సృష్టించి, ప్రజలను ఆందోళనలోకి నెట్టడం తగదని హితవు పలికారు. తానెంతో పద్ధతి ప్రకారం ముందుకు పోతుంటే, కొందరు నీచంగా ప్రవర్తిస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News