: ముద్రగడకు బొండా ఉమ బహిరంగ లేఖ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు, టీడీపీకి చెందిన కాపు నేతలకు మధ్య సంవాదం నడుస్తోంది. ఈ నెల 10న మళ్లీ నిరాహార దీక్షకు దిగుతున్నానని ముద్రగడ పద్మనాభం ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ బహిరంగ లేఖ రాశారు. నిరాహార దీక్ష గురించి ఆలోచించవద్దని లేఖలో ఆయన సూచించారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కాపుల శ్రేయస్సుకు టీడీపీ పని చేస్తోందని అన్నారు. ప్రభుత్వం కాపుల శ్రేయస్సుకోసం పనిచేస్తున్నప్పుడు నిరాహారదీక్ష, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. టీడీపీ చెప్పిన ప్రతిదానిని చేతల్లో చూపిస్తుందని ఆయన లేఖలో తెలిపారు.

More Telugu News